స్వీట్ గవ్వలు

ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం స్వీట్ గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే స్వీట్ గవ్వలు మీ సొంతం.

స్వీట్ గవ్వలు కి కావలసిన పదార్ధాలు:

మైదా లేదా గోధుమపిండి - 1 కప్పు
బొంబాయి రవ్వ - 1 స్పూను
బెల్లం తురుము - 1 /2 కప్పు
నెయ్యి - 2 స్పూన్స్
నూనె - వేయించడానికి సరిపడ

స్వీట్ గవ్వలు తయారు చేసే విధానం:

ఒక పెద్ద పాత్రలో మైదా లేదా గోధుమపిండి, బొంబాయిరవ్వ, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. తరవాత అందులో సరిపడ నీళ్లు పోసి ముద్దలా చేయాలి. ఈ ముద్ద మరి గట్టిగా కాకుండా కొంచం మెత్తగా ఉండేలా కలుపుకోవాలి.
ఈ పిండి ముద్దని అరగంటసేపు నాననివ్వాలి. బాగా నానిన తరువాత ఈ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసి, గవ్వలపీట మీద ఒత్తుకుని కాగుతున్న నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో బెల్లం, కొద్దిగా నీరు పోసి ముదురుపాకం పట్టుకోవాలి తరువాత స్టవ్ ఆఫ్ చేసి, వేయించిన గవ్వలను పాకంలో వేసి బాగా కలిపి 15 - 20 నిమిషాలు ఉంచి తీసేయ్యాలి అంతే నోరూరించే స్వీట్ గవ్వలు తయార్.

Search Recipes (over 5000 recipes)

Food Recipes Food Court