రాగి వీల్స్

ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం రాగి వీల్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే రాగి వీల్స్ మీ సొంతం.

రాగి వీల్స్ కి కావలసిన పదార్ధాలు:

తాజా రాగిపిండి - 200 గ్రా
పంచదార పొడి - 350 గ్రా
ఎండుకొబ్బరిపొడి - 1 కప్పు
మైదా - 300 గ్రా
వెన్న- సరిపడ
చిక్కటి పాలు -1 కప్పు
యాలకులపొడి - 1 స్పూన్
మిరియాలపొడి - 1/2 స్పూన్
ఉప్పు - 1/2 స్పూన్

రాగి వీల్స్ తయారు చేసే విధానం:

ముందుగా ఒక పాత్ర లో వెన్న, పంచదార పొడి, యాలకులపొడి, మిరియాల పొడి, ఉప్పు, పాలు పోసి మృదువుగా కలిపి మిశ్రమం తయారుచేయాలి. తరువాత మైదా, రాగిపిండి, కొబ్బరిపొడుల్ని కూడా ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
ఇప్పుడు ఈ పిండి ని అరగంట వరకు దానిని గాలి చొరబడకుండా ఉండేలా ఒక పాత్రలో ఉంచాలి. తరువాత చపాతీ పీట మీద ఈ పిండి మిశ్రమాన్ని వేసి, రెండు మడతల్లో అరంగుళం మందంగా ఉండేలా పెద్ద రొట్టెను చేసి, మనకు కావలసిన ఆకారంలోకట్ చేసుకోవాలి.
ఇప్పుడు నెయ్యి లేదా నూనె రాసిన లోతున్న ప్లేటులో వీటిని ఉంచి, ఇసుక పోసిన కుక్కర్‌లోగానీ మందపాటి పాత్రలో గానీ ఉంచి సుమారు పది నిమిషాల సేపు ఉడికించాలి. అదే మైక్రోవేవ్ ఒవెన్‌లో అయితే 15 -20 నిమిషాల పాటు 360 డిగ్రీల ఫారెన్‌హీట్‌ దగ్గర బేక్‌ చేసి తీసేయాలి. అంతే టేస్టీ రాగి వీల్స్ తయార్.

Search Recipes (over 5000 recipes)

Food Recipes Food Court