పులస చేప పులుసు

ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం పులస చేప పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే పులస చేప పులుసు మీ సొంతం.

పులస చేప పులుసు కి కావలసిన పదార్ధాలు:

పులస చేప - 1 కేజీ
ఉల్లిపాయలు - 3 పెద్దవి
పచ్చిమిర్చి - 10
బెండకాయలు - 6
కరివేపాకు - కొద్దిగ
ధనియాల పొడి - 2 స్పూన్స్
జీలకర్ర - 1/2 స్పూన్
చింతపండు గుజ్జు - 1 కప్పు
నూనె - 150 గ్రా
ఉప్పు, కారం - సరిపడ
మెంతి పొడి - 1/4 స్పూన్

పులస చేప పులుసు తయారు చేసే విధానం:

ముందుగా చేప ముక్కలను బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఉల్లిపాయ , పచ్చిమిర్చి, బెండకాయ లను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాణలి పెట్టి అందులో నూనె వేయాలి. నూనె బాగా కాగిన తరువాత జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి.
అవి బాగా వేగిన తరువాత టమాట ముక్కలు వేసి బాగా కలపాలి. తరువాత అందులో చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు 2 కప్పుల నీళ్ళు పోసి మూత పెట్టాలి. అవి కొద్దిగ మరుగుతున్నప్పుడు అందులో చేప ముక్కలు వేసి మాములు మంటపై కొద్ది సేపు ఉడికించాలి.
చేప కొద్దిగ ఉడికిన తరువాత అందులో బెండకాయ ముక్కలు, ధనియాల పొడి, మెంతి పొడి, కరివేపాకు, సరిపడ ఉప్పు, కారం కూడా వేసి మూత పెట్టి చిన్న మంటపై 15 - 20 నిమిషాలు బాగా ఉడికించాలి. పులుసు బాగా చిక్కగా అయిన తరువాత దించి పైన కొద్దిగ కొత్తిమీర చల్లుకోవాలి. అంతే సూపర్ టేస్టీగా ఉండే పులస చేప పులుసు తయార్.

Search Recipes (over 5000 recipes)

Food Recipes Food Court