పల్లీ చాట్

ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం పల్లీ చాట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే పల్లీ చాట్ మీ సొంతం.

పల్లీ చాట్ కి కావలసిన పదార్ధాలు:

పల్లీలు - 1 కప్పు
అటుకులు - 2 కప్పులు
స్వీట్ కార్న్ - 1 కప్పు
పుట్నాలపప్పు - 1/2 కప్పు
ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్పు
టొమాటో ముక్కలు - 1/4 కప్పు
నిమ్మరసం - 2 స్పూన్స్
ఉప్పు - సరిపడ
పచ్చిమిర్చి - 2
పసుపు - కొద్దిగ
కారం - 1 స్పూన్
నూనె - తగినంత
కరివేపాకు - కొద్దిగ
కొత్తిమీర తరుగు - కొద్దిగ

పల్లీ చాట్ తయారు చేసే విధానం:

బాణలిలో కొద్దిగా నూనె కాగాక అందులో పల్లీలు వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి. తరవాత, అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి పుట్నాలపప్పు వేయించి పక్కకు తీసుకోవాలి. బాణలిలో మరికాస్త నూనె వేసి అందులో కరివేపాకు, పొడవుగా తరిగిన పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు వేసి అందులో అటుకులు కూడా వేసి కరకరలాడేల వేయించుకోవాలి.
తరువాత మరో పెద్ద పాత్రలో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, వేయించి ఉంచుకున్న పదార్థాలు కూడా వేసి బాగా కలపాలి. కారం వేసి మరోమారు కలిపిన తర్వాత అందులో నిమ్మరసం, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి.
చివరగా స్వీట్‌కార్న్ వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి వెంటనే సర్వ్ చేయాలి. లేదంటే మెత్తగా అయి రుచి మారుతుంది.

Search Recipes (over 5000 recipes)

Food Recipes Food Court