టమాటా రసం

ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం టమాటా రసం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే టమాటా రసం మీ సొంతం.

టమాటా రసం కి కావలసిన పదార్ధాలు:

టమాటాలు - 3
కరివేపాకు – 2 రెబ్బలు
కొత్తిమీర – కొద్దిగ
ఆవాలు – 1/4 స్పూన్
ఇంగువ – చిటికెడు
జీలకర్ర – 1/4 స్పూన్
నూనె – 2 స్పూన్స్
ఎండుమిర్చి – 3
చింతపండు - 50 గ్రా
ధనియాలు - 1 స్పూన్
కందిపప్పు - 1 స్పూన్
పసుపు – 1/4 స్పూన్
ఉప్పు- తగినంత
మిరియాలు - 6
వెల్లుల్లి - 4 రెబ్బలు

టమాటా రసం తయారు చేసే విధానం:

ముందుగా జీలకర్ర, ధనియాలు, మిరియాలు, కందిపప్పు, ఎండుమిర్చి, కొద్దిగ కరివేపాకు, రెండు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగ కరివేపాకు వేసి పొడిచేసుకోవాలి.
తరువాత టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని చింతపండు కలిపి 2కప్పుల నీళ్లుపోసి ఉడికించాలి. చల్లారిన తరువాత చేతితో బాగా కలిపి పిప్పి తీసేయ్యాలి. అందులో మరో కప్పు నీళ్ళు పోసి, పసుపు, ఉప్పు, తయారు చేసిన రసం పొడి, వేసి బాగా కలపాలి.
తరువాత బాణలిలో కొద్దిగ నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు, కొద్దిగ దంచిన వెల్లుల్లి రెబ్బలు మరియు ఇంగువ వేసి కలిపి ఈ మిశ్రమాన్నిరసంలో వేసి బాగా కలిపి చిన్న మంటపై మరిగించాలి.
కొద్దిగా మరిగిన తర్వాత కొత్తిమీర వేసి దింపేయాలి. అంతే ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన టమాటా రసం రెడీ.

Search Recipes (over 5000 recipes)

Food Recipes Food Court