చాక్లెట్ స్నాక్

ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం చాక్లెట్ స్నాక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే చాక్లెట్ స్నాక్ మీ సొంతం.

చాక్లెట్ స్నాక్ కి కావలసిన పదార్ధాలు:

మైదా - 1 కప్పు
నీళ్ళు - 1/4 కప్పు
చాక్లెట్ సాస్ - 2 స్పూన్స్
కోకో పౌడర్ - 1/4 స్పూన్
ఉప్పు - చిటికెడు
నూనె - వేయించడానికి తగినంత
పాకం కోసం:
పంచదార - 1 కప్పు
నీళ్ళు - 1 కప్పు
యాలకుల పొడి - చిటికెడు

చాక్లెట్ స్నాక్ తయారు చేసే విధానం:

ఒక పాత్రలో మైదా, ఉప్పు, కోకో పౌడర్‌లను వేసి కలిపి నీటితో ముద్దగా చపాతీపిండిలాగా కలుపుకోవాలి. పిండిని చపాతీల్లా చేసుకొని వాటిని రోల్ చేసి తరువాత కట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలను నూనెలో డీప్‌ఫ్రై చేయాలి.
ఈ లోపు పక్కన ఒక పాత్రలో పంచదార, నీళ్ళు కలిపి తగినంత మంట మీద మరిగించి సిరప్ చేసుకోవాలి. నూనెలో నుంచి తీసిన కాజాలను పంచదార పాకంలో వేసి ఒక నిమిషం ఉంచి తీయాలి.
ఇలా చేసుకున్న కాజాలను ఒక ప్లేట్‌లో అమర్చి వాటి మీద చాకొలెట్ సాస్ వేసి సర్వ్ చేయాలి.

Search Recipes (over 5000 recipes)

Food Recipes Food Court