చాక్లెట్ సమోసా

ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం చాక్లెట్ సమోసా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే చాక్లెట్ సమోసా మీ సొంతం.

చాక్లెట్ సమోసా కి కావలసిన పదార్ధాలు:

మైదా - 1/4 కేజీ
డాల్డా లేదా నెయ్యి - 50 గ్రా
ఉప్పు - చిటికెడు
చాక్లెట్ బార్ - 6
డ్రైఫ్రూట్స్ ముక్కలు - 1/4 కప్పు
వెనిలా ఎసెన్స్ - 3 చుక్కలు
నూనె - సరిపడ

చాక్లెట్ సమోసా తయారు చేసే విధానం:

ముందుగ మైదాను జల్లించి ఒక పాత్రలో జల్లించిన మైదా, ఉప్పు, కరిగించిన డాల్డా, కొద్దిగా వాము వేసి బాగా కలపాలి. తరవాత అందులో సరిపడ నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్‌ని, చాక్లెట్స్‌ని ముక్కలుగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు కలిపి ఉంచిన పిండి మిశ్రమం బాగా మెత్తగా అయిన తరవాత చిన్నచిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తుకోవాలి. తరువాత చాకుతో రెండు భాగాలుగా కట్ చేయాలి.
ఒక భాగం తీసుకుని అంచులు తడిచేసి కోన్‌లా మడిచి అందులో ఒక స్పూన్ చాక్లెట్ మిశ్రమాన్ని పెట్టి అంచులు విడిపోకుండా ఒత్తి సమోసా లాగా మడిచి వేడి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.

Search Recipes (over 5000 recipes)

Food Recipes Food Court