చాక్లెట్ దోస

ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం చాక్లెట్ దోస ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే చాక్లెట్ దోస మీ సొంతం.

చాక్లెట్ దోస కి కావలసిన పదార్ధాలు:

మైదా - 1/2 కప్పు
పాలు - 1/4 కప్పు
బటర్ - 2 స్పూన్స్
డార్క్ చాక్లెట్ - 1/4 కప్పు
నీళ్ళు - 1 స్పూన్
సోడా - చిటికెడు
చాకొలెట్ సాస్ - 1/2 కప్పు

చాక్లెట్ దోస తయారు చేసే విధానం:

ముందుగా ఒక పాత్రలో మైదా, బటర్, డార్క్ చాకొలెట్, నీరు, పాలు, సోడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్నిఅలాగే 10 - 15 నిమిషాల సేపు పక్కన ఉంచాలి. ఆ తర్వాత పెనం వేడి చేసి దానిపై దోసెలుగా వేయాలి.
రెండు వైపులా ఎర్రగా కాల్చి దోసెలను ప్లేట్లోకి తీసుకున్న తరువాత చాక్లెట్సాస్‌తో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.

Search Recipes (over 5000 recipes)

Food Recipes Food Court