గోంగూర మటన్

ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం గోంగూర మటన్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే గోంగూర మటన్ మీ సొంతం.

గోంగూర మటన్ కి కావలసిన పదార్ధాలు:

గోంగూర - 4 కట్టలు
మటన్ - 1/2 కేజీ
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
కొత్తిమీర - 1కట్ట
లవంగాలు - 4
ధనియాలపొడి - 1స్పూన్
ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు
కారం - 2 స్పూన్స్
ఉప్పు - తగినంత
పచ్చి మిర్చి- 6
నూనె - సరిపడ

గోంగూర మటన్ తయారు చేసే విధానం:

ముందుగా మటన్ ని బాగా కడిగి ఉప్పు, పసుపు, కారం మరియు రెండు కప్పుల నీళ్ళు పోసి కుక్కర్ లో బాగా ఉడికించుకోవాలి.
తరువాత గోంగూరను శుభ్రంగా కడిగి ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. తరువాత అందులో ఉడికించిన మటన్ వేసి అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. నీరంతా ఇంకిపోయిన తరువాత కారం, ఉప్పు వేసి సరిపడా మళ్లీ కొద్ది సేపు ఉడికించుకోవాలి.
ఇప్పుడు అందులో ఉడికించిన గోంగూర, లవంగాలు, ధనియాల పొడి వేసుకొని మరో 5 నిమిషాలు ఉంచి దింపుకోవాలి. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడిగా చపాతీ లేక అన్నంతో సర్వ్ చేయాలి.

Search Recipes (over 5000 recipes)

Food Recipes Food Court