ఉలవల చారు

ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం ఉలవల చారు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే ఉలవల చారు మీ సొంతం.

ఉలవల చారు కి కావలసిన పదార్ధాలు:

ఉలవలు - 100గ్రా
జీలకర్ర - 1/2 స్పూన్
ఆవాలు - 1/4 స్పూన్
పచ్చి మిర్చి - 4
ఎండు మిర్చి - 2
చింతపండు - నిమ్మకాయంత
ఉల్లిపాయలు - 2
కరివేపాకు - రెండు రెమ్మలు
ధనియాల పొడి - 1/2 స్పూన్
కొత్తిమీర - కొద్దిగా
కారం - ఒక స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర స్పూన్
ఉప్పు, నూనె - తగినంత

ఉలవల చారు తయారు చేసే విధానం:

ఉలవలను ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ నీరు తీసి మంచి నీరు పోసుకుని కుక్కర్‌లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఉడికిన ఉలవలను కొద్దిగా చల్లారిన తరువాత మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు బాణలిలో నూనె వేసి కాస్త వేడి అయిన తరువాత ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి కొద్దిగా వేయించాలి. వేగాక అల్లం, వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టమాటలు ముక్కలు కూడా వేసి ఉడికించుకోవాలి.
తరువాత కొద్దిగా కారం, ఉప్పు వేసి కలిపి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉలవల ముద్ద వేసి చింతపండు రసం పోసి మరిగించుకోవాలి. చివరగా ధనియాల పొడి, కొత్తిమీర వేసి దింపుకోవాలి. అంతే. ఉలవల చారు తయార్.

Search Recipes (over 5000 recipes)

Food Recipes Food Court