ఆకుకూరల సూప్

ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం ఆకుకూరల సూప్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే ఆకుకూరల సూప్ మీ సొంతం.

ఆకుకూరల సూప్ కి కావలసిన పదార్ధాలు:

సన్నగా తరిగిన ఆకుకూరలు - 1 కప్పు
ఉల్లి కాడల తరుగు - 3 స్పూన్స్
మైదా - 2 స్పూన్స్
వెన్న - 2 స్పూన్స్
పాలు - 1 కప్పు
మిరియాల పొడి - 1/2 స్పూన్
ఉప్పు - సరిపడ

ఆకుకూరల సూప్ తయారు చేసే విధానం:

ముందుగా ఒక గిన్నెలో వెన్న వేసి అది కొద్దిగా కరిగిన తరువాత కట్ చేసిన ఆకుకూరలు, ఉల్లికాడలు వేసి వేయించాలి. అది కొద్దిగా ఉకికిన తర్వాత అందులో పాలు, 1 కప్పు నీళ్ళు పోసి మెత్తగా ఉడికించాలి.
బాగా ఉడికిన తరువాత అందులో సరిపడ ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి దించెయ్యాలి. అంతే వేడి వేడి ఆకుకూరల సూప్ తయార్. దీనినే సలాడ్ పత్తా సూప్ అని కూడా అంటారు.

Search Recipes (over 5000 recipes)

Food Recipes Food Court